ఏపీలో మ‌రో కీల‌క ఘ‌ట్టం దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేసింది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత సీఎం‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టిన జ‌గ‌న్‌.. తాజాగా మ‌రో కీల‌క అడుగు వేసిన సంగ‌తి తెలిసిందే. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నా యీ బ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) ల సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’  పేరుతో ఆర్థిక సహాయం అందించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అం దజేయనుంది. బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా వారి అక్కౌంట్లలోకి న‌గ‌దు మ‌ళ్లించారు.

 

ఈ కార్య‌క్ర‌మం కోసం రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందించారు. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశారు. షాపులు న్న 1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొంద‌డంతో వాళ్ల కుటుంబాల్లో ఆనందానికి అవ‌ధులు లేవు. ఇదీ.. ప్ర‌భుత్వం ఇచ్చిన జాబితా.. అయితే, వాస్త‌వానికి ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించ‌గానే.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ చేదోడు ఏ తీరాల‌కు? అనే ప్ర‌శ్న‌తో మొద‌లైన ఈ విమ ‌ర్శ‌ల ప‌రంపర‌.. జోరుగానే సాగింద‌ని చెప్పాలి.

 

జ‌గ‌న్ ఈ ప‌థ‌కంలో హామీ ఇవ్వ‌డం త‌ప్పా చేయ‌లేర‌ని ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు చేశాయి. అయితే జ‌గ‌న్ తాను ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఈ ప‌థ‌కం త్వ‌ర‌లోనే అమ‌లు చేసి విప‌క్షాల నోళ్ల‌కు తాళం వేశారు. ప్ర‌స్తుతం గ‌డిచిన ఏడాదిని ప‌రిశీలిస్తే.. అమ్మ ఒడి, రైతు భ‌రోసా, వాహ‌న మిత్ర‌, చేనేత మిత్ర‌.. అనే ప‌థ‌కాలు పెట్టి ప్ర‌జ‌ల‌కు వంద ల వేల కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ పేద‌లకు ఇచ్చారు. ఇప్పుడు ఈ కులాల‌కు కూడా సాయం  చేయ‌డంతో ఈ కులాల‌కు చెందిన కుటుంబాల ఓట్ల‌న్ని వైసీపీకి గంప గుత్తే కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: