తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కరోనా వైరస్ ప్రభావం ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్ని ఆంక్షలు సడలింపులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీసులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో  డ్యూటీలో ఉన్న పదిహేను మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావటంతో పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది. ఒక్క పోలీస్ శాఖ కు మాత్రమే కాదు తెలంగాణ రాజకీయ నేతలకు కూడా కరోనా కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు.

 

ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ రాగా, ఇటీవలె కరోనాతో హాస్పిటల్లో చేరారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తెలంగాణలో ఒకరిద్దరు కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా రాజకీయ నేతలు అప్రమత్తమయ్యారు. కొంతమంది హోమ్ క్వారంటైన్ కి పరిమితం కాగా మరికొంతమంది జనసాంద్రత ఎక్కువగా ఉండే చోట ఉండే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

ఈ తరుణంలో మరోసారి పూర్తిగా లాక్ డౌన్ కరోనా వైరస్ ప్రభావం ఉన్నచోట్ల విధించాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే టైమ్ లో ఈనెల 16, 17 వ తారీఖులలో  దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలు గురించి చర్చించ బోతున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: