తెలంగాణ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహారాష్ట్ర మరియు ఢిల్లీ మిగతా కొన్ని రాష్ట్రాల తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి జాగ్రత్తలు హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు మరియు పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకటం తో తాజాగా కేసిఆర్ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రజా ప్రతినిధులతో అధికారులతో సమావేశమైన కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మరియు జిల్లాలలో పెద్దఎత్తున కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

IHG

కరోనా వైరస్ వ్యాప్తి సమస్యపై ఆయన అదికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోను, చుట్టుపక్కల పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేసిఆర్ అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏభై వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ,తద్వారా అనుమానితులకు చికిత్సలు నిర్వహించవచ్చని ఆయన అన్నారు.

IHG

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో వ్యాప్తి ఎక్కువ కాదని అదికారులు చెప్పారు. ప్రైవేటు లాబ్ లు, ఆస్పత్రులలో కూడా కరోనా పరీక్షలు చేయడానికి, చికిత్సలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు సిద్దం చేయాలని కేసిఆర్ సూచించారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్ది కేసులు పెరుగుతున్న తరుణంలో మరొకసారి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: