కరోనా భయంతో హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజూ 200 కు తక్కువ కాకుండా కేసులు బయటపడుతున్నాయి. ఇవి కూడా లక్షణాలు వచ్చినవారికి పరీక్షలు జరిపితేనే.. ఇవి కాకుండా సైలంట్ గా ఎంత మందికి కరోనా సోకుతుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు మొదట్లో కట్టడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది.

 

 

కరోనా పరీక్షలు చేయడం ఆపేసింది. డాక్టర్లు, జర్నలిస్టులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరికీ కరోనా వదిలిపెట్టడం లేదు. దీంతో హైదరాబాద్ వాసులు బేంబెలేత్తిపోతున్నారు. కరోనా ఎక్కడ తమను కాటేస్తుందోనని భయపడుతున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఓ బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ,చుట్టుపక్కల జిల్లాలలో కరోనా నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

 

 

కరోనా వైరస్ వ్యాప్తి సమస్యపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోను,చుట్టుపక్కల పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కెసిఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 30 నియోజక వర్గాల్లో ఏభై వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని.. తద్వారా అనుమానితులకు చికిత్సలు నిర్వహించవచ్చని ఆయన అన్నారు.

 

 

ప్రైవేటు లాబ్ లు, ఆస్పత్రులలో కూడా కరోనా పరీక్షలు చేయడానికి, చికిత్సలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు సిద్దం చేయాలని కెసిఆర్ సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో వ్యాప్తి ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: