తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి లో చాలా ఈజీగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కట్టడి చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు. వైద్యులకు మరియు పోలీసులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ రావటంతో సామాన్య ప్రజలలో భయాందోళన నెలకొంది. న్యాయస్థానాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రాకపోవడంతో పరిస్థితి ఇప్పుడు కంట్రోల్ తప్పి ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ..కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం నానా తంటాలు పడుతోంది.

IHG

ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రాంతాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముఖ్యంగా 30 నియోజకవర్గాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ 30 నియోజకవర్గాల్లో కరోనా వైరస్ పరీక్షలు భారీ స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది.IHG

ఆ నియోజక వివరాలు లిస్టు చూస్తే..ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్,  ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేలకు మించి పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నియోజకవర్గాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేలా కేసిఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: