గత కొన్ని రోజుల నుంచి విజయవాడ కు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా వచ్చేస్తాడు అదిగో ఇదిగో పూర్తిగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పారు అధికారులు. కానీ చివరి నిమిషంలో అధికారులకు షాక్ ఇచ్చాడు  విజయ్ మాల్య. క్షమాభిక్ష కోరుతూ బ్రిటన్  కోర్టులో పిటిషన్ వేయడం తో విజయ్ మాల్యా ఎంట్రీకి కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం బ్రిటన్ కోర్టులో విజయ్ మాల్యా క్షమాభిక్ష పిటిషన్ వేయగా.. విజయ్ మాల్యాకు క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు అంటూ భారత్ ఆరోపిస్తోంది. 

 


 అయితే వాస్తవంగా అయితే బ్రిటన్ ఉగ్రవాదులకు నేరస్తులకు పౌరసత్వాన్ని ఇస్తుంది.తమ  దేశంలో ఏదైనా నేరాలకు పాల్పడితే కేసులు నమోదు చేయొద్దు  కానీ ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తే మాత్రం పౌరసత్వం కల్పిస్తుంది బ్రిటన్. అప్పట్లో వ్యాపారాల పేరుతో వెళ్లి వివిధ దేశాలలో అక్కడున్న వారందరినీ bదిరించి సంపదలను ఈస్టిండియా కంపెనీ పేరుతో దోచుకుని వచ్చింది బ్రిటన్ . ఈ క్రమంలోనే భారతదేశం నుంచి కూడా లక్షల కోట్లు దోచుకుపోయింది. అందుకే విదేశాల్లో అక్రమాలకు పాల్పడిన వారు  బ్రిటన్ దేశంలో ప్రజాస్వామ్య పోరాటయోధుడు అవుతారు. 

 


 ప్రస్తుతం విజయ్ మాల్యా పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని దారుణంగా బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి.. కోట్లకి కోట్లు ఇతర కంపెనీలకు తరలించి... ఇండియా నుంచి తెచ్చిన సొమ్ము మొత్తం ప్రస్తుతం బ్రిటన్లో ఉంచి క్షమాభిక్ష కోరుతే  వారికి పౌరసత్వం ఇవ్వడానికి కూడా బ్రిటన్  సిద్ధపడుతోంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇలా వివిధ దేశాలలో దోచుకుని అక్రమాలకు పాల్పడిన అందరికీ పౌరసత్వం కల్పిస్తున్న బ్రిటన్ రాబోయే రోజుల్లో సెటిల్మెంట్ గ్యాంగ్ లాంటి ఒక ప్లేస్ అవుతుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే విజయ్ మాల్యా విషయంలో పూర్తిగా డబుల్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: