కేవలం ప్రభుత్వంపైనే కాకుండా, పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపైనా వైసిపి అధినేత సీఎం జగన్ పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడు పెంచుకుని శత్రువులను బలహీనం చేయకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఈమేరకు ఇతర పార్టీల్లో ఉన్న రాజకీయ ఉద్దండులు లను వైసీపీలో చేర్చుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. చాలా కాలం నుంచి పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులు వైసీపీలోకి వచ్చి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, వారంతా జగన్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతున్నట్టుగా కనిపిస్తుండటంతో జగన్ ఇక చేరికలతో వైసీపీలో జోరు పెంచాలని చూస్తున్నారు. 

 

IHG


ఈ మేరకు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమైన వారందరికీ పిలుపులు వెళ్లాయట. మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు ఇలా చాలామంది ఉన్నారు. వారందరికీ ఇప్పుడు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక వారం రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నట్టు సమాచారం. జగన్ ను కలిసి వైసీపీ జెండా కప్పుకోవాలనే సదరు నాయకులు ఆశగా ఉన్నారట. ప్రస్తుతం వలస వచ్చే నాయకుల్లో మాజీ కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కావూరి సాంబశివరావు ఇలా చాలామంది క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది.  వీరంతా గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రులుగా చేసిన వారే. కాంగ్రెస్ బలహీనమైన తర్వాత వీరంతా చెల్లచెదురయ్యారు. 

 

వీరందరికీ గతంలోనే వైసీపీ నుంచి ఆహ్వానాలు అందినా సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ ఆ తర్వాత వైసీపీ లోకి వచ్చేందుకు ప్రయత్నించినా, జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వెయిటింగ్ లో ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరతారని భావించినా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆ తరువాత టిడిపిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గస్థాయి నాయకులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ లోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీలోని వారంతా  ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. 

 


ఏదో రకంగా అధికార పార్టీ నాయకులు అనిపించుకుంటే, తమకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని, ఎటువంటి టెన్షన్ ఉండదనే ఉద్దేశంతో వీరంతా వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి మరింత ఆందోళన పెంచుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: