పీసీసీ మార్పుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైన వార్త బయటకు వచ్చినప్పటి నుండి తెలంగాణ కాంగ్రెస్ నేతలు విపరీతంగా తమ పావులు కదుపుతున్నారు.ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి రహస్య భేటీ లు పెట్టుకున్న వారంతా ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు తెరదీశారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు బహిరంగంగానే తమను పీసీసీకి ఎంపిక చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇకపోతే రేసులో ప్రముఖంగా మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గా రెడ్డి, విహెచ్ రేవంత్ రెడ్డి లు ఉన్నారు.

 

అయితే ఇక్కడ ఒకరితో ఒకరికి పెద్దగా ప్రాబ్లం లేదు గాని ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రేసులో వెనుకబడిన నేతలంతా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి రహస్య మంతనాలకు సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. పిసిసి మార్పు ఖాయమని తేలడంతో పీసీసీ పీటం ఎలాగైనా దక్కించుకోవాలని మరియు తమకు అనుకూలమైన వారు పీసీసీలో కొనసాగాలి అన్న రీతిలో కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.

 

క్రమంలోనే పీసీసీ రేసులో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క జగ్గారెడ్డి శ్రీధర్ బాబులు సీఎల్పీ కార్యాలయంలో రెండు గంటలపాటు భేటి అయి మంతనాలు జరిపినట్లు సమాచారం. పీసీసీ మార్పుపై అధిష్టానం తమ నిర్ణయాన్ని కోరితే ఎలా ముందుకెళ్లాలనేది భేటిలో చర్చించునట్లు తెలుస్తోంది. అలాగే ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులను కాదని టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కి కీలక పదవిని ఎలా కట్టపెడతారు అన్న భావన కూడా వారిలో బలంగా నాటుకుని పోయింది.

 

ఇక రేవంత్ రెడ్డి కూడా ఏమీ తక్కువ తినలేదు. తాను ఒంటరి పక్షినని అర్థం చేసుకొని తన వేటని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం పై చాలా దూకుడుగా వెళుతున్నారు. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫౌమ్ హౌజ్ ఇష్యూ పోలీసులపై కోర్టు ధిక్కకరణ కేసుల్లో పోరాటం చేస్తున్నాడు. అలాగే రేవంత్ వ్యతిరేక వర్గం కూాడా రహస్య భేటిలతో మంతనాలు చేస్తూ తమకు అనుకూలమైన వ్యక్తికే పీసీసీ దక్కేలా పావులు కదుపుతున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కే పీసీసీ కట్టబెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: