తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇటీవల కాలంలో తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధిక సంఖ్యలో టెస్టులు జరపలేదని ఎప్పటినుండో టీఆర్ఎస్ ప్రభుత్వం పై అభియోగం ఉంది. గతంలో అయితే కేసులు తక్కువగా రాబట్టి కేసీఆర్ ఏమన్నా చెల్లింది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండగా కేసీఆర్ ను అటు విపక్షాలు మరియు ఇటు ప్రజలు తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

 

చివరికి కెసిఆర్ తమ రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్స్ కు కూడా కరోనా టెస్టులు చేసే అవకాశాన్ని కల్పించారు. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన అన్నీ ప్రైవేట్ ల్యాబ్స్ లో టెస్టులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మరొక పది రోజుల్లో కనీసం యాభై వేలు టెస్ట్ లను జరుపుతామని హామీ ఇచ్చారు.

 

వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్,మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

 

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే టెస్టుల సంఖ్యను పెంచుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర వద్ద ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ గంగాధర్ కి కరోనా పాజిటివ్ అని తేలడం గమనార్హం. రెండు రోజుల నుండి ఆఫీసర్ ఈటెల తోనే ఉండగా అతని ఈటెల కొరకే పరిస్థితుల్లో ప్రత్యేకంగా నియమించారు. దీంతో మంత్రి కరోనా టెస్ట్ రిజల్ట్ పై సర్వత్రా ఆందోళన నెలకొంది. కాబట్టి అలా కేసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాడో లేదో.. ఏకంగా హెల్త్ మినిస్టర్ కే కరోనా రిస్క్ ఉన్నట్లు బయటపడడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: