గత కొంతకాలంగా వైసీపీలో ఉంటూనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై ఆ పార్టీ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. సందర్భం వచ్చిన ప్రతిసారి వైసిపి పై ఆయన విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దీంతో ఆయన మనస్సు బిజెపిలో... మనిషి వైసీపీలోనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే రఘురామకృష్ణరాజు బిజెపి నేతలతో ఎక్కువగా సాహిత్యంగా ఉండడం వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. కొద్దిరోజుల క్రితమే ఇసుక వ్యవహారంలోనూ, వైసీపీ ప్రభుత్వం పై రఘురామకృష్ణరాజు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు ఇలా వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతూ, ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ఆయన కేంద్రంగా తెరపైకి వస్తూనే ఉంది.

IHG

 

 ఈ విషయాలపై తాజాగా రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తాను వైసీపీలోనే ఉండాలనుకుంటున్నాను అని ఎట్టిపరిస్థితుల్లోనూ వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎంతోమంది పార్టీలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అని, అటువంటప్పుడు తాను సస్పెండ్ అవ్వాలని ఎందుకు కోరుకుంటాను అంటూ ఆయన ప్రశ్నించారు. దేశం మొత్తం వైసీపీ వైపు చూస్తుంటే, తాను బిజెపి వైపు ఎందుకు వెళ్తానని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అని, కాకపోతే సీఎం జగన్ ను నేరుగా కలిసే అవకాశం లేకనే మీడియా ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాలను చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.

IHG's an MP? | TeluguBulletin.com


 సీఎం ను కలిసేందుకు ప్రయత్నిస్తే కొంతమంది అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఇద్దరు ముగ్గురు ఎంపీలకు తప్ప మిగతా వారు ఎవరూ జగన్ ను కలిసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై కోర్టులో వ్యతిరేక తీర్పులు రావడానికి కారణం కొంతమంది అధికారులు, నాయకులు అని, జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ కోటరీ ఎవరు అనేది నాకు తెలియదన్నారు. కాకపోతే వారి పేర్లు మీడియానే చెబుతోందని, ఆ పేర్లు అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

IHG


 ముఖ్యంగా వై.వి.సుబ్బారెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి , విజయసాయిరెడ్డి తో పాటు సీఎం కు అత్యంత సన్నిహితుడైన ఒక అధికారి వల్ల ఇలా జరుగుతోందన్నారు. సీఎం మాత్రమే తమ నాయకుడని, ఆయనకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని, ఇక వేరే ఎవరిని తాము పరిగణలోకి తీసుకోమని రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: