కరోనా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది.. ఈ 2020 లో ఈ పేరు ఎంత ఫేమస్సు అయ్యిందో అందరికి తెలిసిందే.. ఇకపోతే కేసులు తగ్గుతాయని లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం అది కాస్త ఎత్తేసాక మళ్లీ కరోనా విజృంభించడం మొదలైంది.. ఈ దశలో ఈ వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియక అన్ని రాష్ట్రాలు తలలు పట్టుకుంటున్నాయట..

 

 

ఇలాంటి దశలో కేంద్రం మళ్లీ లాక్‌డౌన్ విదించే దిశగా ఆలోచిస్తుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో క్వారంటైన్ రూల్స్ ను కఠినతరం చేస్తూ.. ఎపిడమిక్ డిసీజెస్ యాక్టు–1897 కు పలు మార్పులు చేసి కరోనా ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రతి వారికి భారీ పెనాల్టీ విధించనున్నట్లు ప్రకటించింది.

 

 

అదేమంటే మాస్కు పెట్టుకోకుండా పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చిన వారికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 పెనాల్టీ విధిస్తామని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇకపోతే కరోనా మొదలైనప్పుడు ఉన్న భాధ్యత, భయం ప్రస్తుతం ఏ ఒక్కరిలో కనిపించడం లేదు.. స్వేచ్చగా అధికారులు విధించిన నిబంధలను గాలికి వదిలేసి వ్యవహరిస్తున్నారు.. మాస్కులు లేకుండా వీధుల్లో, మార్కెట్లలో తిరుగుతున్నారు..

 

 

ఈ విషయాలన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ పై రాష్ట్ర గవర్నర్ rani MAURYA' target='_blank' title='బేబీ రాణి మౌర్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బేబీ రాణి మౌర్య శనివారం సంతకం చేశారని, ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది.

 

 

ఇకపోతే కరోనా విషయంలో లాక్​డౌన్ రూల్స్ ను కఠినతరం చేస్తూ, కేరళ, ఒడిశా రాష్ట్రాలు  కూడా డీసీజెస్ యాక్టుకు ఇప్పటికే సవరణలు చేశాయని అధికారులు తెలిపారు.. ఇలాంటి ఎన్ని కఠిన తరమైన రూల్స్ ఎన్ని పెట్టిన మనదేశ ప్రజలు వినే రకం కాదని ఈ సందర్భంగా కొందరు అనుకుంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: