పరిస్థితి అదుపు తప్పినట్టుగానే కనిపిస్తోంది. గతంలో నమోదైన కేసులకు ఇప్పుడు నమోదవుతున్న కేసులకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, రోజుకు సుమారు 12 వేల మందికి పైగా కరోనా కాటుకి గురవ్వడం వంటి సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దాదాపుగా లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయడంతో జనాలు ఎవరికి వారు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు కొంతమంది మాత్రమే పాటిస్తుండగా, మెజారిటీ రాష్ట్రాల ప్రజలు కరోనా అంటే తమను ఏమీ చేయలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య  రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి. అలాగే వివాహాలు, విందులు వంటి చోట గుంపులు గుంపులుగా జనాలు రావడంతో అక్కడ ఎటువంటి నిబంధనలు అమలు జరగడం లేదు.

IHG


 అసలు జనాల్లో ఈ వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్ళీ లాక్ డౌన్ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇక కేంద్రం కూడా లాక్ డాన్ విడిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి లాక్ డౌన్ విధిస్తారని ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 16 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించబోతున్నారు. అంతకు ముందే అంటే ఈ రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

 

ఈ సందర్భంగా లాక్ డౌన్ విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చించబోతున్నారు. ఇదిలా ఉంటే మరో సారి లాక్ డౌన్ నిబంధనలు విధించ వద్దంటూ మెజారిటీ రాష్ట్రాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తిలు వస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా ఉందని, ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టపోయామని, ప్రభుత్వాలను ముందుకు నడిపించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని సూచిస్తున్నాయి. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందని , కరోనా కట్టడి కోసం వివిధ దేశాల్లో నిబంధనలు విధించినా, అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నాయి.

 


 అంతేకకుండా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించే కంటే, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచి జాగ్రత్తలు పాటించాలి అని, కొన్ని లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తే సరిపోతుందని కేంద్రానికి మెజార్టీ రాష్ట్రాలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన క్లారిటీ కి రావాలని చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో  సమావేశం అనంతరం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించే అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: