దేశంలో ఏమంట కరోనా వచ్చిందో కానీ మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.  ఫిబ్రవరిలో మొదలైన కరోనా ప్రభావం మార్చిలో బల పడింది...దాంతో లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించారు ప్రజలు.. ఈ సమయంలోకరోనా కట్టడి బాగానే జరిగింది. ఈ మద్య లాక్ డౌన్ సడలించడంతో మళ్లీ కరోనా వైరస్ పుంజుకుంటుంది. తాజాగా ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా సోకిందన్న భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి తన కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన రాసిన సూసైడ్ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఇన్​కం ట్యాక్స్ విభాగంలో పోస్టింగ్ లో ఉన్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ప్రాణాలు తీసుకున్నాడని సూసైడ్ నోట్ ద్వారా తెలిసినట్లు పోలీసులు వివరించారు. ఈ మధ్యే ఆయన కరోనా టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ… ప్రాణాంతక వైరస్ తన కుటుంబానికి వ్యాపించడం ఇష్టం లేదని, అందుకే చనిపోతున్నట్లు శివరాజ్ సింగ్ నోట్ లో పేర్కొన్నాడని చెప్పారు. 

 

కాగా, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని రావడం గమనార్హం. కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: