ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ హాట్ హాట్ గా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరుగుతోంది. టీడీపీ హయాంలో మంత్రి, ఎమ్మెల్యేల అరెస్టుతో రాజకీయ వేడి రాజుకుంటోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. తప్పు చేసిన వారందరిపై ప్రభుత్వం ఇదే పద్ధతి అవలంబించాలని చెప్తున్నాయే కానీ.. టీడీపీకి వంత పాడటం లేదు. చంద్రబాబు తీరుతో గతంలో వారు పడ్డ ఇబ్బందే ఇందుకు కారణం. అయితే.. టీడీపీకి సపోర్టివ్ పార్టీ అని పేరు తెచ్చుకున్న జనసేన కూడా మౌనమే వహించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

IHG

 

అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే సైలెంట్ గా ఉన్నాడని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వంపై అన్ని పార్టీలు కలసి రావాలని చంద్రబాబు పిలుపిస్తున్నా జనసేన కదలడం లేదు. అలా ఉండటం జనసేన భవిష్యత్తుకు లాభిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ తీరు.. జనంలో టీడీపీపై వ్యతిరేకతను చూస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయంగా జనసేన కనిపించడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పవన్ ఏమాత్రం టీడీపీకి అనుబంధంగా మాట్లాడినా ఈసారి జనసేనకు చారిత్రక తప్పిదం చేసినట్టే. ఇవన్నీ ఆలోచించే జనసేనాని సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు.

IHG

 

2014లో టీడీపీకి మద్దతివ్వడం ఎంత తప్పో పవన్ కు గతంలోనే తెలిసొచ్చింది. ఇప్పటికీ జనసేనకు ‘తెర వెనుక టీడీపీతో దోస్తీనే’ అనే ముద్ర పోవడం లేదు. రీసెంట్ గా ఈ అరెస్టులపై నాదెండ్ల మనోహర్ ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీకి అనుబంధంగా ఉందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఉద్దేశం అదే అయితే.. జనసైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదు. టీడీపీ హయాంలో జనసేన పడ్డ ఇబ్బందులు వారు మర్చిపోలేదు. ఇవన్నీ బేరీజు వేసుకుని పవన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే పార్టీకి లాభం. మరి.. పవన్ ఆలోచనేంటో!

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: