ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మీద ఈ రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం రుదుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో తీసుకెళ్ళి కూర్చో పెడుతున్నారు, ప్రశ్నించడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చిందని జగన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. తాడిపత్రిలో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు.

IHG's family in Tadipatri, assures ...

వాహనాల ఫోర్జరీకి సంబంధించి పెట్టిన కేసుల వివరాలను వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ రాకతో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాను అవినీతి చేసినట్లు జగన్ ప్రభుత్వం పదే పదే విమర్శలు చేస్తోందని నారా లోకేష్ అన్నారు. కానీ ఇంత వరకు నా పై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపించలేక పోయిందని తెలిపారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ కంపెనీ అభివృద్ధి జరగలేదు, జగన్ కంపెనీకి ఒకటే అభివృద్ధి జరిగిందని నారా లోకేష్ ఆరోపించారు. నీళ్లను జగన్ తన కంపెనీకి తరలించుకుపోయారు అని విమర్శించారు.

IHG

రైతులకు ఇవ్వాల్సిన కృష్ణా నీటిని తన కంపెనీలకు తరలించారని నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్... జేసీ దివాకర్ రెడ్డి తో ప్రత్యేకంగా సమావేశం అయి కేసుల వివరాలు అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అనేక విషయాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: