ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను మృత్యువు ఒడిలోకి నెట్టిన కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజు కు పెరుగుతూ వస్తుంది. ఈ కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా ఇళ్లకే పరిమితమయ్యే లా చేసింది. అంతే కాదు జనాల మధ్య దూరం పాటించాలని సూచించారు.దీంతో స్వచ్చందంగా అన్నీ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు మూత పడ్డాయి..

 

 

 

కరోనా ప్రభావం కొంత వరకు తగ్గు ముఖం పట్టడంతో యదావిధిగా అన్నీ పనులను చేసుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చింది.కరోనా మహమ్మారిని ఎదుర్కొనే దిశగా యావత్ ప్రపంచంలోని డాక్టర్లు సాగుతున్నారు..అయితే ఇప్పటికే కొన్ని దేశాలలోని డాక్టర్లు వాక్సిన్ ను కనిపెట్టే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు.చైనాలోని ప్రముఖ ఫార్మా సంస్థ సైనోవాక్‌ బయోటెక్‌ కరోనావాక్‌ పేరుతో కొవిడ్‌ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇది ఇప్పటికే రెండు దశల హ్యూమన్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నది. జూలైలో 9 వేల మందిపై ఆఖరి, మూడోదశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

 

 

 

ఈ దశలో విజయవంతమైతే టీకాను మార్కెట్‌లో విడుదల చేయడానికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. సైనోవాక్‌ కంపెనీ తమ టీకాలను భారీగా ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే బ్రెజిల్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. తమ టీకా కరోనాను అంతం చేస్తుందని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తున్నది. 3 నెలల్లో ఏజడ్‌డీ 1222: అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, బ్రిటన్‌కు చెందిన అస్ట్రాజెనెకా సంయుక్తంగా ‘ఏజడ్‌డీ 1222’ టీకాను అభివృద్ధిచేశాయి. ఇది ప్రస్తుతం రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నది. దాదాపు 10వేల మందిపై దీనిని ప్రయోగిస్తున్నారు. మూడో దశ ట్రయల్‌ను బ్రెజిల్‌లో నిర్వహించనున్నారు. సాధారణ జలుబు కలిగించే వైరస్‌కు, స్పైక్‌ ప్రోటీన్‌ను జోడించడం ద్వారా దీనిని తయారుచేశారు.

 

 

 

ఇది ప్రస్తుతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది.  టీకా సక్సెస్‌ అయితే మూడు నెలల్లోనే భారీగా ఉత్పత్తి చేసేందుకు ఫార్మా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.కరోనా నుంచి రక్షణకు ఎంఆర్‌ఎన్‌ఏ 1273 ఒక్క డోసు సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: