3-3-2020 నుంచి మరో కొత్త శకం ఆరంభం అయ్యింది. అదేమిటి కొత్త శకం అంటున్నాడు అని ఆశ్చర్యం గా ఉందా? చిత్తగించండి 

 

1. Rs.400/- ఖర్చు పెట్టి ఒక pizza తెచ్చుకొని తలా ఒక ముక్క తిని ఆనందపడే వాళ్ళం. కానినిప్పుడు సీను మారింది . pizza base రెండు పీసులు Rs.25 /-  మాత్రమే దాని టాపుప్ మరో Rs.50/- అనేది తెలిసి పోయింది . ఇంట్లో పిజ్జా లు రెండు చేస్తే కేవలం 150/- కూడా కావడం లేదు . పది పిజ్జా ల కాస్ట్ తో ఓవెన్ వొస్తుంది అని కూడా తెల్సి పోయింది. 

 

2. పిల్లలు ఇష్ట పడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక 100 గ్రాములు Rs.75 ki ఎంతో ఆబా గా తిని మురిసి పోయారు. 
ఇప్పుడు కిలో ఆలు గడ్డలు తో అరకిలో ఫ్రెంచ్ ఫ్రై కేవలం 100 రూపాయలకే చేస్తున్నారు ఇంట్లో. 

 

3. సినిమా హాలు కి వెళ్లకుండా ఉండగలం. సినిమాలు ఒక పది హిందీ వి OTT ద్వారా Netflix , amazon channel lo వస్తున్నాయి.పాపం ఐమాక్స్ లు ఇనాక్స్ లు ఆసియన్ , PVR company వాళ్ళ ఊహలు తల కిందులయ్యాయి. కోట్ల లో నష్టం. 

 

4. IPL లేకుండా ఉండగలం . 

 

5. పాత రామారావు గారు నాగేశ్వర రావు సినిమా లు కొంత మంది కుర్రకారు కూడా ఇష్టం గా చూస్తున్నారు. ఓల్డ్ ఇస్ గోల్డ్. 

 

6. హెల్త్ పట్ల మెడ్డిల్ class వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 

 

7. దారుణం ఏమిటంటే క్యాన్సర్ పేషంట్స్ కేమో థెరపీ రెగ్యులర్ గా జరగక కొన్ని వందల మంది పోయారు. అలాగే హార్ట్ అట్టాక్ వొచ్చిన వాళ్ళు కూడా దెబ్బ తిన్నారు. 

 

8. రేపటి కి డబ్బు దాచుకో అని కరోనా అందరికీ చాటి చెప్పింది.

 

9. ఎలక్షన్స్ వొస్తే తప్ప బీద వాళ్ళు అయిన వలస కూలీలను ఏ పార్టీ పట్టించు కొదు అని రుజువు అయ్యింది. 

 

10. ఒకాయన ఫ్రస్టేషన్ తో అన్నాడు ఒక పది మంది మినిస్టర్స్ ఒక యాబై మంది ఎమ్మెల్యే లు కరీనా తో పోతే తప్ప ఏ ప్రభుత్వం పట్టించుకోదు. 

 

11. మహా నగరాల లో హాప్పి గా బ్రతకలేము అని తెలిసి పోయింది. 

 

12. చవక బియ్యం , చవక మద్యం కాదు వైద్య సౌకర్యం కావాలి అని జనం తెలుసుకొన్నారు. 

 

కరోనా కొంత మంచి కూడా చేసింది. కోటీశ్వరుడు మొదటి సారి భయపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: