దేశంలో కరోనా ప్రభావంతో మార్చి 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రావాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.  ఇక రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా భారీగా  తగ్గిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా రెండు నెలలు మాత్రం రోడ్డు ప్రమాదాల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గిందని అధికారులు అన్నారు. ఇక గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీరోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఆ మద్య వలస కార్మికులను తీసుకు వెళ్తన్న బస్సు, ఇతర వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురై ఎంతో మంది చనిపోయారు. తాజాగా బీహార్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. 

 

గ‌యా జిల్లా అమాస్ ప‌ట్ట‌ణంలోని విష్ణుపూర్ స‌మీపంలో ఎదురుగా వ‌స్తున్న ఆటోలోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.  మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గ‌యా జిల్లా పోలీసులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

మృత‌దేహాల‌ను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గ‌యా జిల్లా ఆస్ప‌త్రికి పంపించారు.  అయితే లారీ అత్యంత వేగంతో రావడం ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంటున్నారు. అధిక‌వేగంతో వ‌చ్చిన లారీ అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న రెండు ఆటోల‌ను ఢీకొట్టింద‌న్నారు. మృతులంతా గ‌యా జిల్లాకు చెందిన వార‌ని, ఔరంగాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఫంక్ష‌న్‌కు హాజ‌రై తిరిగి గ‌యాలోని స్వ‌గ్రామానికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం బారిన‌ప‌డ్డార‌ని పోలీసులు వివ‌రించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: