దేశంలో కరోనా వ్యాప్తి చాలా ఫాస్ట్ గా జరుగుతున్న తరుణంలో ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధించడానికి రెడీ అయింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఉదృతంగా ఉండటంతో తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఆధ్వర్యంలో చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు జిల్లాలలో లాక్ డౌన్ కఠినతరం చేయడానికి రెడీ అయ్యింది.

IHG

ఈనెల 19 నుంచి 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ నాలుగు జిల్లాలలో విధించాలని తమిళనాడు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ పరిస్థితిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇవ్వటం జరిగింది.  అంతేకాకుండా హోటళ్లు మరియు రెస్టారెంట్లలో పార్శిలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ కేసులు ఉన్న కొద్ది ఈ నాలుగు జిల్లాల్లో బయటపడటంతో పళనిస్వామి క్యాబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

IHG

ఈ పరిమాణం తో దేశంలో మొదటి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు, లాక్ డౌన్ కేంద్రం వెసులుబాటు ఇచ్చిన తర్వాత తమిళం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధించడం విషయంలో. ఈసారి పకడ్బందీగా ఎక్కడికక్కడ ఈ నాలుగు జిల్లాల్లో కఠినతరం గా పోలీసులను పెట్టి లాక్ డౌన్ విధించాలని ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా పక్కా ప్లానింగ్ తో తమిళ ప్రభుత్వం రెడీ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: