ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో జరగాల్సిన ఈ సమావేశలు అప్పట్లో లాక్ డౌన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయడం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం  అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు అరెస్టులు కావటంతో.. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చోక్కలతో వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలో సోమవారం జరిగిన టీడీఎల్పీ ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

IHG's 'black protest' against Centre over Andhra special ...

అంతేకాకుండా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయములో ఏడాదిలో అక్రమార్కులు మరియు ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు సంబంధించి గవర్నర్ కి వినతి పత్రం అందజేయడం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. జరగబోయే ఈ రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా అక్రమ అరెస్టు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.

IHG

అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకత విధానాల వల్ల న్యాయస్థానాలలో వస్తున్న తీర్పులు గురించి ఇంకా అనేక విషయాల గురించి వైసీపీ నీ ఇరుకున పెట్టడానికి టీడీపీ బలమైన వ్యూహాలతో రెడీ అవుతోంది. మరోపక్క వైసీపీ జరిగిన అరెస్టులు గురించి వాటికి సంబంధించిన అవినీతి విషయాల గురించి అసెంబ్లీ సమావేశాల లో సీఎం జగన్ ప్రజలకు క్షణ్ణంగా తెలియజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద జరగబోయే రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: