సాధారణంగా కుక్కలకు వాసన పసిగట్టే అలవాలు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే పెద్ద పెద్ద నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు వీటిని ఉపయోగిస్తుంటారు.  కుక్కల్లోకొన్ని ప్రత్యేక జాతులకు వాసన పసిగట్టే సుగుణం జీన్స్ లో ఉంటాయి.  ఈ నేపథ్యంలోను కొన్ని జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ పోలీసులు డాగ్ స్వ్కాడ్స్ ని వెంట పెట్టుకొని నేర పరిశోధనకు వెళ్తుంటారు. కుక్కలు పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా కరోనా రోగులను గుర్తు పట్టేలా పట్టేలా కొన్ని దేశాల శాస్త్రవేత్తలు కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుక్కలు పెద్ద పెద్ద నేరగాళ్లను పట్టించిన సంఘటనలు ఉన్నాయి. అయితే డాగ్స్ ని ఇప్పుడు కరోనా పరీక్ష కోసం కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. 

 

ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందని పారిస్ కు చెందిన పరిశోధకులు వెల్లడించిన సంగతి తెల్సిందే. దీని ఆధారంగా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు.  ఒకవేళ ఇదే గకన మంచి సక్సెస్ అయితే కరోనా భారిన పడిన వారు ఎక్కడికీ తప్పించుకోలేరు.. అలాంటి వారిని గుర్తించి వెంటనే ఐసోలేషన్ వార్డు కి పంపించే ఏర్పాటు చేస్తామని అంటున్నారు. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించక ముందే వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు.

 

మనుషుల్లో మలేరియా, పార్కిన్సన్స్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో కుక్కలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.  ఈ నేపథ్యంలోనే బెల్జియమ్ మలినోస్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలకు అల్ఫోర్ట్ లోని నేషనల్ వెటర్నరీ స్కూల్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కుక్కలు విజయవంతంగా పని చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.    తక్కువ సమయంలో ఎక్కువమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: