ఏపీలో అధికార వైసీపీలో రాజ‌కీయం ముదురుతోంది. ఎంపీలకు ఎమ్మెల్యేల‌కు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. కొద్ది రోజుల క్రిత‌మే రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మ‌ధ్య వార్ ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు వ‌ర్సెస్ న‌రసాపురం ఎంపీ ముదునూరి ప్ర‌సాద‌రాజుకు మ‌ధ్య వార్ స్టార్ట్ అయ్యింది. కొద్ది రోజులుగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు వైసీపీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు కౌంట‌ర్‌గా న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

 

మ‌ళ్లీ ప్ర‌సాద‌రాజు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ త‌న‌పై వ్యాఖ్య‌లు చేస్తేనే ప్ర‌సాద‌రాజుకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న కార‌ణంతోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. జ‌గ‌న్ ద‌య‌తోనే తాను ఎంపీను, పార్ల‌మెంట‌రీ క‌మిటీ చైర్మ‌న్‌ను అయ్యాన‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా ఆయ‌న ఖండించారు. పార్టీలోకి తనకు తానుగా రాలేదని, కాళ్లవేళ్లా బతిమిలాడితే వచ్చానన్నారు. న‌ర‌సాపురం ఎంపీ సీటు టీడీపీకి కంచుకోట అని.. అక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని త‌న‌ను బ‌తిమిలాడితేనే తాను వైసీపీలోకి వ‌చ్చాన‌ని ఆయ‌న చెప్పారు. 

 

తాను పోటీ చేయ‌బట్టే న‌ర‌సాపురం ఎంపీ సీటు వైసీపీ ప‌ర‌మైంద‌న్న ఆయ‌న కొన్ని లెక్క‌లు కూడా చెప్పారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 19వేల మెజార్టీతో, ఉండిలో కొత్త అభ్యర్థి 12వేల మెజార్టీతో... తణుకులో 2వేల మెజార్టీతో, న‌ర‌సాపురంలో ప్ర‌సాద‌రాజు 5 వేల ఓట్ల‌తో గెలిచార‌ని.. టీడీపీ వాళ్లు భారీ మెజార్టీల‌తో గెలిస్తే వైసీపీ నేత‌లు బోర్డ‌ర్‌లో గెలిచార‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిబొమ్మ చూసి ఓట్లేసే ప‌రిస్థితి లేద‌ని కూడా ఆయ‌న తేల్చిచెప్పారు. ఇక తాను అంద‌రిలా డ‌బ్బులు క‌లెక్ట్ చేయ‌లేద‌ని.. డైలాగ్ వేశారు. ఈ డైలాగ్ ప‌రోక్షంగా త‌న‌కు కౌంటర్ వేసిన ర‌ఘురామ‌కృష్ణం రాజుకే అన్న చ‌ర్చ‌లు స్థానికంగా న‌డుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: