కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో పాటు, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సుమారు రెండు నెలలపాటు కఠినమైన నిబంధనలు విధించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి కఠినమైన నిబంధనలు తప్పనిసరిగా విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా రాష్ట్రాలు అభిప్రాయపడుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు విధించవద్దని, విధిస్తే లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి అంటూ అనేక విజ్ఞప్తులు కేంద్రానికి అందుతున్నాయి. దీనిపై కేంద్రం కూడా సీరియస్ గా దృష్టి సారించింది. 

IHG's Surprise <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DELHI' target='_blank' title='delhi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>delhi</a> LNJP Hospital Visit After ...


కరోనా కి వాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో కఠినమైన నిబంధనలు విధించకపోతే పరిస్థితి అదుపులోకి రాదనే అభిప్రాయంలో కేంద్రం ఉంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు సమావేశం నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బిజెపి, కాంగ్రెస్, బిఎస్పి, ఎస్పి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గైడ్ లైన్స్ ప్రకారం అన్ని పార్టీలు తప్పనిసరిగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. 


అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి, కలిసికట్టుగా కరోనాను  ఎదుర్కునేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని ఈ సందర్భంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే ఢిల్లీలో ప్రతి వారికి కరోనా టెస్ట్ నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో రోజుకు 18 వేల కరోనా టెస్ట్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్  ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, కరోనా పరిస్థితిపైన, రోగులకు అందుతున్నసేవలపైన ఆరా తీశారు.


 ఇక ఢిల్లీలో మరోసారి కఠినమైన నిబంధనలతో  లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం అరవింద్ క్రేజీవాల్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక అమిత్ షాతో జరిగిన మీటింగ్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పాల్గొనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: