ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొద్ది వైరస్ ప్రభావం పెరుగుతున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ముప్పు జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తన సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వచ్చే నెల జులై పదవ తారీకు నుండి రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడం జరిగింది.

IHG

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ప్రమాదకర స్థితిలో ఉందని, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో సరైన రవాణా సదుపాయం కూడా లేదని, ఇలాంటి సమయంలో పరీక్షలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలు తెలంగాణ,తమిళనాడు, ఒడిషా, చత్తీస్ గడ్ లు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాల విదానాలు తీసుకుని అమలు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.

IHG

మరోపక్క ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగానే రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. వైరస్ ప్రభావం ఎక్కువగా పిల్లల పై ఉండే అవకాశం ఉండటంతో...చాలావరకూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ గట్టిగా వినబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: