ఊహించని విధంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అచ్చెన్న అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు జగన్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ చంద్రబాబుతో సహ ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇటు తన బాబాయ్ అరెస్ట్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నారు. దారుణంగా దుండగుల్లాగా వచ్చి బాబాయ్‌ని టెర్రరిస్టు లాగా అరెస్ట్ చేశారని, అచ్చెన్నాయుడుని ఏ పార్టీ నేతలైనా గౌరవిస్తారని, అసెంబ్లీలో ప్రశ్నించడాన్ని సహించలేక ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడారు.

 

అయితే ఇలా అచ్చెన్నని సడన్‌గా అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలు నెక్స్ట్ ఎలాగైనా వైసీపీ నేతలకు చుక్కలు చూపించాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. తర్వాత అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళకు సినిమా చూపిస్తామని అంటున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ టర్మ్‌కు రామ్మోహన్ నాయుడుని సెంట్రల్ పాలిటిక్స్‌ నుంచి తీసుకొచ్చి స్టేట్ పాలిటిక్స్‌లో దించితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సుముఖంగానే ఉంటారని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడుని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపితే బెటర్ అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే రామ్మోహన్‌కు మంత్రి పదవి వస్తుంది. అప్పుడు వైసీపీకి చుక్కలు చూపించవచ్చు. అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో స్ట్రాంగ్ నాయకుడు ఉన్నట్లు ఉంటుందని చెబుతున్నారు.

 

అయితే బాబాయ్ అరెస్ట్ దెబ్బకు రామ్మోహన్ మనసు కూడా మార్చుకుని ఇదే ప్లాన్‌లో ఉండే అవకాశాలున్నాయి. ఖచ్చితమైన అవకాశం దొరికితే రామ్మోహన్ ఎమ్మెల్యేగా బరిలో దిగుతారు. పైగా ఈయన కోసం సీట్లు కూడా రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీకి వయసు మీద పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తక్కువ ఉంది.

 

ఆ సీటు నుంచి రామ్మోహన్ బరిలో ఉంటే గెలవడం సులువే. అటు నరసన్నపేట బరిలో కూడా దిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ధర్మాన బ్రదర్స్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి రామ్మోహన్ ఈ రెండు చోట్లలో ఒక చోట బరిలో దిగితే వారికి చెక్ పెట్టినట్లు ఉంటుంది. రామ్మోహన్ స్టేట్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం దక్కుతుంది. మరి చూడాలి వచ్చే ఎన్నికలనాటికి పరిస్తితి ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: