వైఎస్ జగన్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఆయనకు  అవేమీ కొత్త కూడా కాదు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాది పాలనలోనే పాపులర్ సీఎం ల జాబితాలో నాలుగవ స్థానానికి  చేరిపోయారు. ఇక జగన్ కి రిస్క్ చేయడం చాలా ఇష్టం.

 

ఆయన ఇపుడు అలాంటి ప్రయోగమే చేస్తున్నారు అనుకోవాలి. ఓ వైపు కరోనా మహమారి దేశమంతా విస్తరించి విశ్వరూపం చూపిస్తోంది. ఇటువంటి సమయంలో జగన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం నిజంగా గ్రేటే అంటున్నారు. కరోనా వేళ ఎవరూ సమావేశాలను సభనలు నిర్వహించడానికి కనీసంగా ఆలోచించడమేలేదు. పార్లమెంట్ సమావేశాలు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ అసెంబ్లీ మీటింగును కరోనా వేళ తగిన జాగ్రత్తలు తీసుకుని కొద్ది రోజులైనా నిర్వహించాలనుకోవడం విశేషమే మరి.

 

ఈ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసినట్లేనని అంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా సామాజిక దూరం పాటించేలా చూడడం, శానిటైజేషన్ వంటివి ఎప్పటికపుడు పాటించడం చేస్తున్నారు. ఇక సభలో ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టి చర్చకు పెట్టడం కూడా అరుదైన సందర్భం.  పెద్దగా చర్చ లేకుండా బడ్జెట్ తో పాటు బిల్లులు కూడా సభ అనుమతి తీసుకోవడం
కూడా ఈసారి విశేషం.

 

ఇక అసెంబ్లీకి రాకుండా గవర్నర్ వీడియో సమావేశం ద్వారా ప్రసంగం చేయడం మరో విశేషం.  అసెంబ్లీ అనగానే సహజంగా అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధాలు, గొడవలు, రచ్చ వంటివి ఉంటాయి. అందునా బడ్జెట్ సెషన్ అంటే చాలా సుదీర్ఘంగా ఉంటుంది. చాలాకాలంగా ముఖాముఖాలు చూసుకోని అధికార విపక్ష సభ్యులు ఒక చోటకు చేరగానే ఒకరి మీద మరొకరు మాటల దూకుడు చూపిస్తారు. 

 

కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు అలా కాకుండా గప్ చిప్ గానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ధాటీగా మాట్లాడినా గొంతు పెద్దది చేసి అరచినా తుంపరలు నోటి ద్వారా  బయటకు వచ్చి కరోనా మహమ్మారిని స్వయంగా పిలిచినట్లుగా ఉంటుంది. దాంతో సభ్యులంతా పెద్దగా మాటల్లేకుండానే సభను ఒక తంతుగా ముగిస్తారు అంటున్నారు. మొత్తం మీద ఆరు నెలల తరువాత జరుగుతున్న ఏపీ అసెంబ్లీ మీట్ లో ఈసారి రసవత్తరమైన రాజకీయానికి పెద్దగా అవకాశం లేకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: