కరోనా ప్రస్తుతం రాజకీయ నాయకులను కూడా భయానికి లోను చేస్తుంది.. ఇదివరకు సామాన్య మానవులకు, విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుత పరిస్దితుల్లో అందర్ని ఆవహిస్తుంది.. సమస్త మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన ఈ కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారి ఇప్పటి వరకు ఎందరి ప్రాణాలో పొట్టన పెట్టుకుంది.. ఇంకా తన ప్రతాపాన్ని చూపించడానికి రోజు రోజుకు బలంగా మారుతుంది.. ఈ క్రమంలో దీని బారిన ఎందరో పడ్డారు..

 

 

అందులో తెలంగాణాలో ఎంతమంది రాజకీయ నాయకులను ఈ వైరస్ పలకరించిందో చూస్తే.. తాజాగా తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చట్టసభల సభ్యుల్లో టీఆర్ఎస్‌కి చెందిన ఎమ్మెల్యేనే మొదటి పాజిటివ్ కేసు. ఇక ఆయనతో పాటుగా పలువురు కీలక నేతల సంబంధీకుల్లో పాజిటివ్ నమోదు కావడంతో అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.

 

 

ఇతని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో, ముందస్తుగా మంత్రి జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఇకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ తో పాటుగా, పేషీలోని అటెండర్ కూడా వైరస్ బారిన పడగా, మేయర్ కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్ పాటిస్తున్నారు. అంతే కాకుండా మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సహాయకుడు ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో మంత్రితో పాటుగా మరో 16 మంది సిబ్బంది హోం క్వారంటైన్ పాటిస్తున్నారు.

 

 

ఇక జనగాం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, ఆయనతో పాటు అతని భార్య, గన్‌మేన్, వంట మనిషి, డ్రైవర్ మొదలగు వీరికి కూడా వైరస్ పాజిటివ్ అని నిర్ధారించారు. ఇక కుటుంబంతో సహా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎమ్మెల్యే ఇటీవల తన నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో ఆయనకు వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. కాగా ఆ ఎమ్మెల్యే తో పాటుగా ఆయన భార్య కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన కుటుంబీకులకు, సిబ్బందికి పరీక్షలు చేస్తున్నాట..

మరింత సమాచారం తెలుసుకోండి: