వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాలలో ఎక్కువ ఎదురు దెబ్బలు తగలటం జరిగాయి. జగన్ తీసుకున్న దాదాపు 60 కంటే పైగా నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పు పెట్టడం జరిగింది. వరుసగా న్యాయస్థానాలలో తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేక తీర్పులు రావటంతో ప్రజలలోను, ప్రతిపక్షాలలో ప్రభుత్వంపై చులకన భావన ఏర్పడింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియం మరియు అమరావతి భూముల నిర్ణయం హైకోర్టులో అట్టర్ ఫ్లాప్ గా మారిపోయాయి. న్యాయస్థానంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఈ తీర్పులు వల్ల వైసీపీ ప్రభుత్వం అనేక విమర్శలు ప్రత్యర్థుల నుండి ఎదుర్కోవాల్సి వచ్చింది.

IHG's Order, Gives Relief to DISCOMs ...

ఇదిలా ఉండగా మొట్టమొదటిసారి జగన్ ప్రభుత్వాన్ని పొగిడింది హైకోర్ట్. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరు అమోఘం అంటూ హై కోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని ముఖ్యంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వటం అనేది మామూలు విషయం కాదని పేర్కొంది. ఈ ఘటనలో ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

IHG

అప్పట్లో లాక్ డౌన్ టైంలో జరిగిన ఈ ఘటన టైం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటనే స్పందించి తాడేపల్లి నుండి ఆ రోజు ఉదయమే హాస్పిటల్లో చేరిన బాధితులను పరామర్శించి చనిపోయిన మరియు బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా భారీస్థాయిలో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా డబ్బులు అతి తక్కువ టైమ్ లోనే కేవలం పది రోజుల్లోనే బాధితులకు ఇవ్వడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: