తెలంగాణలో కరోనా  విజ్రంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏకంగా 200కు పైగా కరోనా కేసులు నమోదవుతూవస్తుండగా ఈరోజు కూడా  భారీగా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 219 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జిహెచ్ఎంసి లోనే 189కేసులు నమోదయ్యాయి.
 
కాగా వరంగల్ లో ఈరోజు కొత్తగా 7పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. వరంగల్ అర్బన్ 4, రూరల్ లో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో ఈరెండు జిల్లాల్లో  మొత్తం 18కేసులు నమోదయ్యాయి.10రోజుల ముందు వరకు ఒక్క కేసు కూడా నమోదు కానీ వరంగల్ లో ఇప్పుడు అనూహ్యంగా కేసులు పెరుగుతుండడంతో రెండు జిల్లాల ప్రజల్లో భయాందోళన నెలకొంది.  
 
ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 5147 కేసులు నమోదవ్వగా అందులో 2766మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2240కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో మరో ఇద్దరు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 187కు చేరింది అయితే గత 24గంటల్లో 1085 శాంపిల్ టెస్టులు చేయడం గమనార్హం. ఇన్ని రోజులు టెస్టుల సంఖ్య 500-600కే పరిమితం కాగా తాజాగా ఈ సంఖ్య పెరిగింది. ఇక ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా అనుమతినివ్వడంతో రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య మరింత పెరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: