ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ESI కుంభకోణం విషయంలో అరెస్ట్ అవ్వటం ఆ తరువాత అనంతపురం మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి నకిలీ పత్రాలతో బస్సులు రాష్ట్రవ్యాప్తంగా నడుపుతున్నారు అనే ఆరోపణల  కేసులో అరెస్టు చేయడం జరిగింది. వరుస అరెస్టులతో తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో వాతావరణం వేడెక్కింది. ప్రజలు అధికారం ఇచ్చింది పై పాలించడం కోసమని కక్షసాధింపు చర్యలకు కాదని వైయస్ జగన్ గుర్తు పెట్టుకోవాలి అంటూ టీడీపీ నేతలు అరెస్టులపై స్పందించడం జరిగింది.

IHG

ఇటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది గంటల్లో జరగబోతున్న తరుణంలో మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట అయ్యన్న నిరసన చేశారు. ఆ క్రమంలో లాక్‌డౌన్ నిబంధనలు ఆయన ఉల్లంఘించారు.

IHG

దీంతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న తరుణంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య వాతావరణం నువ్వా నేనా అన్నట్లు ఉంది. మరోపక్క కరోనా వ్యాధి ఎక్కువగా ఉండటం ఈ సమావేశాలను రాజకీయ సమావేశాలుగా కాకుండా సామరస్య వాతావరణంలో ముగించేయాలని అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాన్ని కోరుతున్నారు. మరి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో సీన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: