ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు పార్టీ కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరకు కొంతమంది మంత్రులు కూడా ఒకటే మాట. జగన్ ను కలవడం, నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునేందుకు అవకాశం దొరకక ఇబ్బందులు పడుతున్నామని, అసలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని వారు అంతర్గతంగా మాట్లాడుకుంటున్న మాటలు. పైకి మాత్రం ఒకరిద్దరు మాత్రమే జగన్ తీరుపై విమర్శిస్తూ తమ బాధను వెళ్లగక్కుతున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే జగన్ డైనమిక్ సీఎంగా  దేశవ్యాప్తంగా జగన్ పరిపాలన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ఎన్నో రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయి. జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షిస్తున్నాయి. వాటిని తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.

IHG


 ఇలా చెప్పుకుంటూ వెళితే జగన్ కు సంవత్సర కాలంలో వచ్చిన క్రెడిట్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కి రాలేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% హామీలను అమలు చేసి చూపించారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఎక్కడా సంక్షేమ పథకాలకు ఆటంకం కలగకుండా జగన్ ముందుకు వెళ్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, జగన్ ఒక కోటరీలో   చిక్కుకుపోయారని, దాని నుంచి బయటపడే మార్గం తెలియక విలవిలాడుతున్నారని, ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వాస్తవంగా చెప్పుకుంటే, ప్రతి ముఖ్యమంత్రికి ఒక కోటరీ  ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్లాలంటే చాలా కష్టమైన పని. 

 


ఏ విషయాన్ని అయినా ఆ కోటరీ నాయకులకు చెప్పి వారి అనుమతితో మాత్రమే ముఖ్యమంత్రిని కలిసే వీలుంటుంది. టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు ఇదేరకమైన వైఖరితో ముందుకు వెళ్లారు. చంద్రబాబు అపాయింట్మెంట్ ఎవరికి దక్కేది కాదు. తమ సమస్యలు చెప్పుకునేందుకు  కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ విషయంలోనూ కనిపిస్తోంది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కొంత సమయం కూడా కేటాయించలేని పరిస్థితి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నెలకొనడం, నియోజకవర్గ సమస్యలను, వివిధ అభివృద్ధి నిధుల మంజూరుకు సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేకుండా పోతోంది.

 


 వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇదే వ్యవహారం పై జగన్ తీరును విమర్శిస్తున్నారు. జగన్ కోటరీ లో ఉండే వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ,విజయసాయిరెడ్డి కోటరీగా ఉన్నారని, వారిని తప్పించుకుని జగన్ ను కలవడం అసాధ్యం అంటూ ఆయన అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థిస్తున్నారు. లోలోపల ఆయన చెప్పింది నిజమే అన్న విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు. జగన్ ఈ కోటరీ నుంచి బయటకు రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలహీనం కావడం ఖాయమని , సొంత పార్టీ నాయకులే ఇప్పుడు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: