తెలుగు మీడియాలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజూ వార్తలు ఇచ్చేవారు.. ఇప్పుడు తామే వార్తలుగా మారుతున్నారు. ఆ మధ్య టీవీ5 రిపోర్టర్ కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పలు మీడియా సంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జర్నలిస్టులు డ్యూటీ అంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.

 

 

తెలుగు మీడియా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉంది. అన్ని ప్రధాన చానళ్ల కార్యాలయాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందులోనూ హైదరాబాద్ లో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మనోజ్ మరణం తర్వాత తెలంగాణ సర్కారు కాస్త పరీక్షలపై దృష్టి పెట్టి జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయించింది.

 

 

దీంతో ఒక్కరోజే 23 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. ఇప్పుడు ఫీల్డులో ఉంటే రిపోర్టర్లే కాదు.. డెస్కుల్లోని జర్నలిస్టులు.. చివరకు స్క్రీన్ మీద కనిపించే యాంకర్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ లోని మీడియా ఆఫీసుల్లో ఇప్పటి వరకు 200కు పైగా కేసులు వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. వీరి ద్వారా వీరి కుటుంబ సభ్యులకూ ప్రమాదం పొంచే ఉంది.

 

 

అయితే.. గతంలో కరోనా కేసులు వస్తే.. ఆ ఏరియాను, ఆ అపార్ట్ మెంట్ ను సీజ్ చేశారు. లోపలి నుంచి బయటకు.. బయట నుంచి లోపలికి రాకపోకలు లేకుండా పూర్తిగా గేట్లు మూసేశారు. కానీ మీడియా హౌస్ లో ఆ పరిస్థితి లేదు. వాటిని సీజ్ చేయాలంటే ఛానల్ , పేపర్ మూత వేయాల్సిన పరిస్థితి. అందుకే ఆఫీసులను మూత వేయకుండానే అక్కడే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: