ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సైకిల్ పార్టీకి కంగారు పుట్టేలా కొన్ని కొన్ని రాజకీయ  పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఆ బాటలో టిడిపి మాజీ మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం లో ఆయన చంద్రబాబుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించారు. అమరావతి రాజధాని వ్యవహారంలో మొత్తం అన్ని తానే ముందుండి నడిపించారు. అప్పట్లో ఆయన పై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం రాజధాని వ్యవహారం, భూములు, అవినీతి వ్యవహారాలపై వైసీపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు ఆదేశించడం అప్పట్లో అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలిన మంత్రులను ఇప్పుడు టార్గెట్ చేసుకుని జైలుకు పంపించే ప్రక్రియ మొదలవ్వడంతో  నారాయణ బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

IHG


 ఇప్పటికే అరెస్టు అయిన మాజీ మంత్రి టీడీపీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారంతో నారాయణ లో భయం మరికాస్త పెరిగినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ టార్గెట్ తానేనని, ముందుగానే గ్రహించిన నారాయణ వైసీపీలోకి జంప్ చేస్తే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారంపైనా, అక్కడ జరిగిన అవినీతి వ్యవహారాలపైన త్రిసభ్య మంత్రివర్గ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక ఇస్తే తాను తప్పకుండా చిక్కుల్లో పడతానని నారాయణ గ్రహించారు. అదీ కాకుండా పెద్ద ఎత్తున విద్యాసంస్థల వ్యాపారం కూడా ఉండడంతో పాటు, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆయన వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

 


 ఇప్పటికే తనకు చెందిన రెండు విద్యాసంస్థలను నిబంధనల ఉల్లంఘన పేరుతో సీజ్ చేశారని, కానీ ఈ విషయంలో  పార్టీ తనను పట్టించుకోలేదనే ఆవేదనలో నారాయణ ఉన్నారు.టీడీపీలో ఉంటే భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నారాయణ చేరిక లాంఛనమే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: