ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కి మరో గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీని వీడేందుకు పెద్దఎత్తున నాయకులు సిద్ధమవుతున్నారు అనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని జైలుకి పంపించడం, మరోవైపు టీడీపీ కీలక నాయకులు అందరిని వైసీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అదీ కాకుండా ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో వైసీపీ తరఫున నలుగురు అభ్యర్థులు టిడిపి తరఫున వర్ల రామయ్య రాజ్యసభకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు ముందుగానే టిడిపి ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేస్తారనే ప్రచారం చంద్రబాబులో ఆందోళన పెంచుతోంది. 

 

IHG


సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలోనే టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారనే భయంతో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. 19 తేదీన తెలుగుదేశం పార్టీ బలం ఏమిటో తెలిసి పోతుందని ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వంటివారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి దూరమైతే తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రద్దు అవుతుంది. ఇప్పటి కే టీడీపీకి చెందిన శాసనసభ్యులు వల్లభనేని వంశీ ,కరణం బలరాం, మద్దాలి గిరి వంటివారు పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరికొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 


తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ముందుగానే పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలోకి జంప్ చేస్తారని ఎమ్మెల్యేలు వైసీపీలో చేరకపోయినా, టీడీపీక రాజీనామా చేసి ఝలక్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలయ్యింది. కొద్దీ రోజుల క్రితమే టీడీపీ శాసనసభ్యులు  ప్రకాశం జిల్లాకు చెందిన ఏలూరు సాంబశివరావు, గుంటూరు జిల్లాకు చెందిన అనగాని ప్రసాద్ వంటి వారు పార్టీని వీడుతారనే ప్రచారం జరిగినా, ఆ తర్వాత వారు చంద్రబాబు  రాయబారంతో మెత్తబడ్డారు. కానీ ఇప్పుడు ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం టిడిపిని వీడేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసి చంద్రబాబు ను మానసికంగా దెబ్బ తీయాలనే ఆలోచనతో అధికార పార్టీ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: