మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు ఇటీవలే ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి కూడా తీసుకోకుండానే ఆయన అరెస్టయ్యారు. దాదాపు 20 గంటలపాటు ఓ పేషెంటును జీపులో కూర్చోబెట్టి తిప్పారని తెలుగు దేశం ఆరోపిస్తోంది. జగన్ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోందని నిందలు వస్తోంది.

 

 

అయితే ఈ ఈఎస్‌ఐ స్కామ్‌లో జరిగిన అవినీతి విలువ 150 కోట్లుగా చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తోంది. ఈఎస్‌ఐ స్కామ్ సంగతి అటుంచితే.. ఇటీవల ఏపీ సర్కారు ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది.

 

 

ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో గతంలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం స్టడీ చేసి అవినీతిని ప్రాధమికంగా నిర్దారించిందని కొడాలి నాని అన్నారు.

 

 

అందుకే దానిని సిబిఐ విచారణకు అప్పగించడానికి మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి కొడాలి నాని తెలిపారు. దీనితో పాటు పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో కూడా భారీ అవినీతి చోటు చేసుకుందని అన్నారు. ఈఎస్ ఐ స్కామ్ లో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని కొడాలి నాని అన్నారు.

 

 

మరి రూ. 150 కోట్ల అవినీతే అచ్చెన్నాయుడికి అంతగా చుక్కలు చూపిస్తే.. మరి ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ లోనే వెయ్యి కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న నారా లోకేశ్ పరిస్థితి ఏంటి.. ఇంకా పోలవరం, ఇతర జాబితాలు తీస్తే ఆ వేల కోట్ల అవినీతి విషయంలో చంద్రబాబు పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి చూడాలి ఏసీబీ ఏం చేస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: