దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో అధికార యంత్రాంగం ప్రమత్తమైంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు దేశంలో రైల్వే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆలోచిస్తూ ఉంటుందన్నారు. అందుకు తగినట్లుగానే వారికి అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తోందన్నారు. ఇప్పుడు కేవలం ప్రయాణికులు మాత్రమే కాకుండా సరుకు రవాణా చేసే వారికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ రైల్వేస్ ఆలోచిస్తుందని అధికారులు వెల్లడించారు.

 

 

అందులో భాగంగానే రైల్వే శాఖ పలు నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోందన్నారు. డెలివరీ ఆలస్యం అయితే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ అందించడం జరుగుతుందన్నారు. ఎక్కువ దూరపు సరుకు రవాణాపై రాయితీలు కల్పించడం వంటి అంశాలను ఇండియన్ రైల్వేస్ పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వలన దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతులు తెలిసిందే. లాక్ డౌన్ వల్ల రైల్వేస్‌ కు సరుకు రవాణా లేకపోవడంతో రూ.8,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వేస్ ఎలాగైన సరుకు రవాణా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోందన్నారు.

 

 

తాజా గణాంకాల ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. రైల్వేస్ సరుకు రవాణా ఆదాయం ఏప్రిల్, మే నెలల్లో రూ.8,283 కోట్లు తగ్గిందన్నారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గత వారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో సరుకు రవాణా ఆదాయం పెంపు అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోందని రైల్వేశాఖ మంత్రి ఈ సందర్బంగా తెలిపారు. 

 


రైల్వే జోన్లను ప్రోత్సహించాలని, స్థానిక వ్యాపారులకు, వెండర్లకు అవసరమైన పార్సిల్ ట్రైన్స్ నడపడానికి ప్రయత్నించాలని పీయూష్ గోయల్ తెలిపారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా ట్రైన్ ఆలస్యమైతే వారికి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ అందించడం ద్వారా వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని సూచించారు. కాగా ఐఆర్‌సీటీసీ నడుపుతున్న ప్రైవేట్ ట్రైన్స్‌ ఆలస్యమైతే ప్రయాణికులకు క్యాష్‌బ్యాక్ లభిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: