చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ యూర‌ప్ దేశాల‌ను అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే. క‌రోనావ ఐర‌స్ భీక‌రంగా దాడి చేస్తూ విస్త‌రిస్తుంటే ఇప్ప‌టికీ యూర‌ప్ దేశాలు చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి.ప్ర‌పంచ ప‌రిణామాల్లోని ముందడుగులో భాగంగా
 కరోనా కారణంగా మూతపడిన యూరప్ దేశాల బార్డర్లు మూడు నెలల తర్వాత సోమవారం తెరుచుకోవ‌డం గ‌మ‌నార్హం. యూరప్ యూనియన్లోని 27 దేశాల్లోని ప్రజలు పాస్ పోర్టు లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు మాత్రం అమ‌ల్లోనే ఉంటాయ‌ని ఆయా దేశాలు ప్ర‌క‌టించాయి.జర్మనీ, ఫ్రాన్స్ బార్డర్ లో సోమవారం తనిఖీలను నిలిపివేశారు. 

 

ఇటలీ కూడా తన బార్డర్ ను తెరిచేసింది. ఆర్థిక ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకునేందుకే ఆయా దేశాలు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.క‌రోనా కార‌ణంగా అత్యంధికంగా దెబ్బ‌తిన్న దేశాలు ఇట‌లీ, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీగా చెప్పాలి. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లో కరోనా కేసులు లక్షల్లో న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే న‌మోద‌వుతూనే ఉన్నాయి. మరణాల శాతం కూడా ఎక్కువ‌గా ఉంది. రిక‌వ‌రీల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం...ఎక్కువ రోజులు ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అలాగే స్పెయిన్‌‌‌‌‌‌‌‌లోనూ క‌రోనా విల‌యం సృష్టించింది. ఇటలీ కూడా కరోనా దెబ్బకు అతలాకుతలమవుతోంది.  ప్రతి రోజూ 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 

 

అయితే కొద్దికాలంగా ఇక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గింది.ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రపంచ వ్యాప్తంగా 81.07 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.38 లక్షల మంది మృతి చెందారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 41.87 లక్షల మంది
ఇంటికి చేరుకున్నారు. భారత్‌లో మొత్తం 3లక్షల 32వేల 424 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.  ఇప్పటివరకు 1,69,798 మంది డిశ్చార్జ్ కాగా , 9,520 మంది మృతి చెందారు.  దేశంలో ప్రస్తుతం 1,53,106 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: