నగరంలో కరోనా అంటే ఇప్పటికి చులకన భావం కనిపిస్తుందని తెలుస్తుంది.. ఎందుకంటే ప్రాణాలు పోయవలసిన డాక్టర్లలో కొందరు ఈ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారని ఇక్కడ జరిగిన సంఘటన చదివితే తెలుస్తుంది.. రోజు రోజుకు మానవ బాంబ్ కంటే ప్రమాదకరంగా మారుతున్న ఈ వైరస్ పట్ల శ్రద్ధ గానీ, భయం గాని నగరంలోని మనుషుల్లో కనిపించడం లేదు.. దీని ఫలితం మరికొద్ది రోజుల్లో అనుభవించే ప్రమాదం లేకపోలేదు..  ఇకపోతే నిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు కరోనాకు కేరాఫ్‌గా మారనుందా అనే సందేహాలు అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల తలెత్తుతున్నాయట.. అదేంటో చూస్తే.. సుమారు ఒక 15 రోజుల కిందట యూరాలజీ విభాగంలో చేరిన ఒక రోగికి కరోనా పాజిటివ్‌ అని తేలిందట.. అయితే ఈ రిపోర్ట్‌లు వచ్చేవరకు కూడా ఆయనకు నర్సులు సేవలు అందించారట..

 

 

ఇక ఆ పరీక్షల్లో సదరు రోగికి కరోనా అని తేలడంతో, నిమ్స్‌ కమిటీ ఆ రోజు విధుల్లో ఉన్న వారందరికీ 'క్వారంటైన్‌' సిఫార్స్ చేసింది. కాగా రెండో రోజే కరోనా రోగికి ఎక్కువగా సేవచేసిన సదరు నర్సును విధుల్లోకి రావాలని నిమ్స్‌ అధికార గణం హెచ్చరించడంతో, క్వారంటైన్ లో ఉన్న ఆ నర్సు విధుల్లో చేరారు. ఇకపోతే ఆమెకు నేరుగా ఈఎండి (ఎమర్జన్సీ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌)లోనే డ్యూటీ వేశారు. అలా సుమారు రెండు మూడు రోజులు అక్కడ విధులు నిర్వహించిన అనంతరం మరో రెండు విభాగాల్లో డ్యూటీ వేశారట. ఇక పదమూడో రోజున ఆ నర్సుకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందట. దాంతో హుటాహుటిన ఆమెను ఆదివారం రాత్రి మిలీనియం బ్లాకులోని కరోనా వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

కాగా ఈ నర్సు కరోనా పెట్టుకుని సుమారుగా, ఏడు రోజులు విధులు నిర్వహించారు. ముఖ్యంగా నర్సుల హాజరు సమోదు చేసుకునే మాట్రన్‌ ఆఫీస్‌ వద్ద రోజూ వందలాది నర్సులతో ఆమె కాంటాక్టయ్యారు. విధి నిర్వహణలో భాగంగా సహోద్యోగులతో టీలు తాగారు. కలిసి భోజనాలూ చేశారు. దాంతో ఇప్పుడు నిమ్స్‌ సిబ్బందిలో ఆందోళన మొదలైంది.. ఇదిలా ఉండగా పాజిటివ్‌గా తేలిన నర్స్‌ భర్త నగరంలో అత్యంత ప్రముఖమైన ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కాగా ఆయనకు సైతం కరోనా వైరస్‌ సోకినట్టు తెలిసింది. దాంతో రెండు ఆస్పత్రుల్లో గగ్గోలు పుడుతోంది..

 

 

చూశారా స్టాలిన్ సినిమాలో చిరంజీవి నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు ఇద్దరికి చెయ్యి ఇలా ఆ ఇద్దరు మరో నలుగురికి అని చెప్పినట్లుగా ఇక్కడ నీకు కరోనా ఉంటే మరొకరికి పంచు అలా వారు నగరం అంతా పంచుకుంటు వెళ్లుతారు అనే రీతిలో కరోనా వ్యాప్తి జరుగుతుంది.. కాబట్టి బాధ్యత తెలిసిన ప్రతివారు కరోనా నుండి తమతో పాటుగా మీ చుట్టుపక్కల వారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: