వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవ్వరూ చెప్పలేరు. నిజమే కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసి పోతాయి. ఈ మద్య కరోనా తో ఇది మరీ ఎక్కువైంది.. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రతిరోజూ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి.  ఇక మనం మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లల ప్రాణాలు కోసం అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి. తెలిసీ తెలియని తనంతో చిన్న పిల్లలు చేసే తప్పులు వారి ప్రాణాల మీకు రావొచ్చు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో విషాదం నెలకొంది.  అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు తెలియని తప్పు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు.  వారు ఆడుకుంటున్న పాండే ఏరియాలో నలుగురు పిల్లలు ఆడుకుంటూ.. కారులోకి వెళ్లి కూర్చున్నారు.

 

ఆ తర్వాత కారు లాక్‌పడటంతో పిల్లలకు బయటకు రాలేకపోయారు. నలుగురిలో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారుల వయసు 4, 7 సంవత్సరాలు మాత్రమే.. ఆటకోసం వెళ్లి అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.  మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోర్దాబాద్‌(సిటీ) ఎస్పీ అమిత్‌ కుమార్‌ ఆనంద్‌ తెలిపారు. అందుకు చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో వారిని ఓ కంట కనిపెట్టాలని అంటుంటారు.  ఇలాంటి సంఘటనలు, బోరు బావిలో పడే సంఘటనలు ఎన్నో జరిగినా అవి మళ్లీ పునరావృతం కావడం శోచనీయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: