సాధారణంగా మనం సినిమాల్లో కొంత మంది రౌడీలు తమ శత్రువుని చంపి అది హత్య కాదు.. ఆత్మహత్యగా లేదా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తుంటారు. ఇందుకు కొంత మంది అవీనీతి పోలీసులు కూడా వారికి వత్తాసు పలికి వారు చెప్పినట్లు కేసు బుక్ చేసుకుంటారు. ఇది ఛేదించడానికి హీరో నానా తంటాలు పడుతుంటారు. మొత్తానికి నేరస్తుల గుట్టు రట్టు కావడం స్టేషన్ పాలు కాడం చూస్తుంటాం.  తాజాగా ఇలాంటి సీన్ మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో జరిగింది.  కాకపోతే ఇక్కడ కేసు తారు మారు చేసింది ఎవరో కాదు ఓ పోలీస్ అధికారి. ఓ పోలీసును కొంతమంది దుండగులు హత్య చేశారు. పోలీసు హత్యను స్థానిక పోలీసు స్టేషన్‌ ఇంచార్జి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు.

 

అయితే వారి పాపం పండి ఈ గుట్టు పోలీసుల ద్వారానే రట్టైంది. నయాగన్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ ప్రభాల్‌ ప్రతాప్‌ సింగ్‌.. ఆదివారం సాయంత్రం పాట్లా గ్రామానికి వెళ్లాడు.  అక్కడ కొంత కాలంగా బ్లాక్ డిజిల్ మాఫియా కొనసాగుతుంది. అక్రమంగా డిజిల్ రవానా, విక్రమం చేస్తున్నారు. వీరికి అడ్డు వచ్చి ఎవ్వరినీ వదలరు. ఈ క్రమంలో  కానిస్టేబుల్‌ ప్రభాల్‌ ప్రతాప్‌ సింగ్‌ డిజీల్‌ విక్రయిస్తున్న వారిని అడ్డగించాడు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ను.. దుండగులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారు. అయితే స్టేషన్‌ ఇంచార్జి ఆశీష్‌ ధృవ్‌ మాత్రం.. ప్రతాప్‌ హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు.

 

కానిస్టేబుల్‌ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులకు నివేదించాడు.  మొదట ఇది అందరూ నిజమే అని రోడ్డు ప్రమాదంలో ఆ కానిస్టేబుల్ చనిపోయారని భావించారు. పోలీసులు పాట్లా గ్రామానికి వెళ్లి విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రతాప్‌ను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది.  అంతే ఒక్కసారిగా ఆశీష్‌ ధృవ్‌ గుట్టు రట్టయ్యింది. వెంటనే విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: