దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ ఆవిర్భావం గురించి స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త సుందర్ కృష్ణ ఈ ఏడాదిలో వైరస్ అంతమవుతుందని ధీమాగా చెబుతున్నాడు. 
 
కరోనా వైరస్ గతేడాది డిసెంబర్ లో సూర్యగ్రహణం సమయంలో ఆవిర్భవించిందని... అప్పుడే చైనాలో ఈ వైరస్ బయటపడిందని అన్నారు. గ్రహణం తర్వాత విడుదలయ్యే శక్తి వల్ల తొలి న్యూట్రాన్ పరివర్తణ చెంది కణ సంక్రమణ తర్వాత కరోనావైరస్ ప్రభావం మొదలైందని అన్నారు. డిసెంబర్ 26వ తేదీ తరువాత గ్రహ ఆకృతీకరణ జరిగిందని.... సూర్యగ్రహణం రోజునే ఈ వైరస్ అంతమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
సూర్యరశ్మి నుంచి వ్యాపించిన ఈ వైరస్ కు భూమి అనుకూలమైన ప్రాంతమని... అందుకే వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని ఆయన చెప్పారు. వాతావరణంలో బయో న్యూక్లియర్ ఇంటరాక్షన్ వల్ల వైరస్ వ్యాపించిందని వ్యాఖ్యలు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కాంతి తరంగాల వల్ల వైరస్ వ్యాప్తి ఆగిపోయే అవకాశం ఉందని చెప్పారు. వైరస్ ఆవిర్భావం సాధారణంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. 
 
ఇది సహజమైన ప్రక్రియ అని ప్రజలు వైరస్ ను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని అన్నారు. వైరస్ ను సూర్య గ్రహణం సమూలంగా నివారిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వేసవికాలంలో వైరస్ తీవ్రత తగ్గుతుందని అనేక కథనాలు వెలువడ్డాయని.... చాలామంది పేరు కోసం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: