తెలుగుదేశం పార్టీ నాయకులకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలలో బలమైన సాక్షాలతో చాలామంది నేతలు ఇటీవల అరెస్టు కావడంతో టీడీపీ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అచ్చెన్నాయుడు తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి ఇలా వరుసగా అరెస్టులు కావటంతో ఏపీ రాజకీయాలలో ప్రతిపక్ష మరియు అధికార పార్టీల మధ్య వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇదిలా ఉండగా జేసీ దివాకర్ రెడ్డి పై ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో అనేక అవినీతి ఆరోపణల వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ వార్తలు ఇంకా వస్తూ ఉండగానే మరో వివాదంలో ఇరుక్కున్నారు జేసీ దివాకర్ రెడ్డి.

 

పూర్తి విషయంలోకి వెళితే జేసీ దివాకర్ రెడ్డి మరియు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి తన భవనాన్ని ఆక్రమించారు బాధితుడు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా మల్లికార్జున మరియు ఆయన కుటుంబ సభ్యులు అంతా కలసి అనంతపురంలో జేసీ ట్రావెల్స్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే 2009వ సంవత్సరంలో మల్లికార్జున కుటుంబ సభ్యులు బాబయ్య అనే వ్యక్తికి భవనాన్ని లీజుకు ఇవ్వగా అదే భవనంలో కొన్నాళ్ళకు దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.

 

2009 నుంచి భవనాలకు సంబంధించి అద్దె ఇప్పటి వరకు జెసి దివాకర్ రెడ్డి ట్రావెల్స్ యాజమాన్యం చెల్లించలేదని మల్లికార్జున ఆరోపిస్తూ… అన్యాయంగా తమ భవనాన్ని ఆక్రమించడం కాకుండా తమ జోలికి వస్తే చంపేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని మల్లికార్జున ఇటీవల ఆరోపించారు. ఈ తరుణంలో తన భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని తరలించే వరకు తాను పోరాటం చేస్తానని ప్రాణాలైనా కోల్పోతాను గాని తన భవనాన్ని మాత్రం వదులుకోను అని మల్లికార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: