సాధారణంగా హత్యలు, ఇతర పెద్ద పెద్ద నేరాలు చేసి వారికి నేరం రుజువైతే ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అయితే ఓ కోతికి జీవిత ఖైదు విధించారు.. ఇక అది బోనులోనే జీవితకాలం ఉండాలని శిక్ష విధించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అదేంటీ మనుషులకు అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంటారు.. మరి కోతి అంత పెద్ద నేరం ఏం చేసింది దానికి అంతపెద్ద శిక్ష విధించారని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. గత కొంత కాలంగా దాని తీరులో మార్పు రాకపోవం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అసలు విషయం తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లాల్సిందే.

 

మిర్జాపూర్ జిల్లాలో పుట్టిన దాన్ని ఓ వ్యక్తి పెంచుకునే వాడు. తనతో పాటు తరుచూ  దానికి మద్యం అలవాటు చేశాడు. మొదట ఇది మాములుగా తాగినా.. తర్వాత తన బాస్ ని మించిపోయింది.  మద్యానికి బానిసైంది.. అంతలోనే దాని యజమాని చనిపోయాడు. అప్పటి నుంచి దాన్ని చూసుకునే వారు లేరు.. పైగా మద్యం కోసం అది పిచ్చెక్కినట్లు చేస్తుండేది. కోపంతో ఎవరు కనిపిస్తే వాళ్లపై దూకి దాడి చేసేది. దీంతో స్థానికులు అది ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గజ గజ వణికిపోయేవారు. 

 

 ఇలా అది ఉన్మాదంతో 250 మందిని కరిచింది.  దాంతో కోతి గురించి అటవీశాఖ వారికి ఫిర్యాదు చేశారు. బోను సాయంతో దాన్ని బంధించి జూ పార్కుకు తరలించారు. అప్పటి నుంచి దాన్ని ఇతర కోతులతో కలపాలని చూసినా.. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించేది.. వాటిని గాయపరిచేది. దీంతో దాన్ని  మూడేళ్లుగా బోనులోనే బంధించారు. అయినా కూడా దాని తీరులో మార్పురాకపోవడంతో ఇక జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. సాధారణంగా మనుషులు కూడా మద్యానికి బానిసలైతే ఇలాగే ఉన్మాదులుగా ప్రవర్తిస్తుంటాన్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: