వైసిపి పార్టీ నాయకుడు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మొదటి నుండి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికార వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిన రఘురామ కృష్ణం రాజు ఇటీవల ఏకంగా పార్టీ అధిష్టానం పెద్దలను టార్గెట్ చేసి షాకింగ్ కామెంట్లు చేయడం పెను దుమారాన్ని రేపుతోంది. మొదటిలో ఇంగ్లీష్ మీడియం పేదలకు అందించడం కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలని జగన్ తీసుకున్న నిర్ణయం ఈ ఎంపీ తప్పు పట్టడం జరిగింది. అదే సమయములో తన పార్లమెంటు పరిధిలో రఘురామకృష్ణంరాజు కి వ్యతిరేకంగా ఉండే గోకరాజు గంగరాజు కుటుంబాలను జగన్ దగ్గరికి తీసుకోవడం పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.

IHG

దీంతో అప్పటి నుండి రఘురామకృష్ణం బాగా డీప్ గా హర్ట్ అయినట్లు...ఆ పరిణామంతో పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తే పార్టీ సస్పెండ్ చేయడంతో వేరే పార్టీలోకి ఈజీగా వెళ్ళటం జరుగుతుందని, సానుభూతి కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుందని  రఘురామకృష్ణంరాజు భావిస్తున్నట్లు పరిశీలికుల మాట.

IHG's premises in Hyd for allegedly ...

కాగా ఈ ఏడాది కాలంలో తన పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యల గురించి వైయస్ జగన్ ని కలవాలి అని ప్రయత్నించిన...పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కావాలని తనకి జగన్ దగ్గర అపాయింట్మెంట్ దొరకకుండా చేయటంతో, ఈసారి ఇంకా పూర్తిగా తాను పార్టీకి రాజీనామా చేయాలని రఘురామ కృష్ణం రాజు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో ఉన్న విలువ లేకపోవటంతో రఘురామకృష్ణంరాజు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: