ఏపీ బ‌డ్జెట్ మంగ‌ళ‌వారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ప్ర‌వేశ పెట్టారు. ఇక కీల‌క‌మైన న‌వ‌ర‌త్నాల కోసం ఏకంగా భారీ ఎత్తున నిథులు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన కు రు. 3009 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ ఆసరా కు 6300 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ పెన్షన్ కానుకకు 11 వేల కోట్లు, అమ్మ ఒడి కి ఆరు వేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ మత్స్య కార భరోసాకు 109 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ వాహన మిత్రకు వైఎస్ఆర్ వాహన మిత్రకు 275.51 కోట్లను కేటాయించారు. జ‌గ‌న్ ఏదైతే ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చారో ఆ హామీల‌న్నింటిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. 

 

ఇక ఈ రోజు బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్ర‌భుత్వం ఈ యేడాదిలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఎలా నెర‌వేర్చింది ?  ఎన్ని నెర‌వేర్చారు ? ఈ యేడాది బ‌డ్జెట్ ఎలా ఉంటోంది ?  గ‌తేడాది ఏ రంగంలో ఎంత వృద్ధి రేటు సాధించారో చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇక మొత్తంగా గ‌తేడాది వివిధ‌ పథకాల ద్వారా 3.98 కోట్ల మందికి లబ్ది చేకూర్చామని అన్నారు. 

 

గోరు ముద్ద పథకం ద్వారా 1105 కోట్లు ఖర్చు చేసామని గవర్నర్ అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 6.5 లక్షల మందికి వైద్యం అందించినట్టు గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. ఇక ప‌లు రంగాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందో గ‌వ‌ర్న‌ర్  బిశ్వ భూషణ్ హరి చంద్ లెక్క‌ల‌తో స‌హా చెప్పారు. ఏదేమైనా గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌న్ చేసిన అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి లెక్క‌ల‌తో చెప్ప‌డంతో పాటు పాల‌న, అభివృద్ధి , సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో జ‌గ‌న్ డెడికేష‌న్ ఏంటో ఆంధ్రా ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: