ఈ మద్య కొంత మంది మనుషులు మానసిక వత్తిడికి లోనై తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. కొంత మంది వస్తువులపై, మనుషులపై చూపిస్తే మరికొంత మంది తమకు తాము శిక్ష విధించుకుంటున్నారు. తాజాగా బాయ్ ఫ్రెండ్ తో గొడవ జరిగిందని ఓ యువతి రన్నింగ్ లో ఉన్న విమానం అద్దం పగులగొట్టిన ఘటన చైనాలో జరిగింది. చైనాలోని జినిగ్ కు చెందిన 29 ఏళ్ల లీ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి విడిపోయింది. ఆ వెంటనే ఆమె జినిగ్ నుంచి తూర్పు చైనాలోని యాన్చెంగ్కు వెళ్లడానికి లూంగ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ఫ్లైట్ ఎక్కడానికి ముందు లీ 500 ml మద్యం తాగింది.

 

ఫైట్ బయలుదేరి 30 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు లీ తన బాయ్ ఫ్రెండ్ తో జరిగిన గొడవ గుర్తుకువచ్చి సహనాన్ని కొల్పోయింది. ప్రియుడిని గుర్తు తెచ్చుకుని ఆ బాధలో విమానం కిటికీని పిడికిలితో కొడుతూ పగులకొట్టే ప్రయత్నం చేసింది. అది చూసిన తోటి ప్రయాణికులు వెంటనే లీ ను సముదాయించి పట్టుకున్నారు. వెంటనే అప్రత్తమైన పైలట్ విమానాన్ని హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌలో అత్యవసరంగా దించాడు. దీంతో విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.

 

అయితే, అప్పటికే విమానం కిటికీ స్వల్పంగా పగిలిపోవడంతో దాన్ని జెంగ్చూ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపారు. గ్లాస్ మొత్తం పగిలితే విమానం కూలిపోయేది. గ్లాస్ పూర్తిగా పగలకముందే లీ ను అడ్డుకొని విమానాన్ని దించడంతో.. తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా,  లీ రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 160mg / 100ml గా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే లీ ని రిమాండ్‌కు తరలించారో లేదా విమానానికి నష్టం కలిగించినందుకు జరిమానా విధించారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: