కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా నాశనం చేసింది ? చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు అత్యంత దారుణంగా పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ పెట్టినప్పట్టికి ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా అలాంటి కరోనా వైరస్ పేద, ధనిక తేడా లేకుండా కరోనా వైరస్ వస్తుంది. 

 

IHG

 

పీఎం లేదు సీఎం లేదు ఎవరికైన వస్తా అంటుంది ఈ కరోనా వైరస్. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ పంజా విప్పుతుంది. ఇంకా తెలంగాణాలో అయితే మరి దారుణం. కొందరు రాజకీయనాయకులు సైతం కరోనా భారిన పడ్డారు. ఇంకా ఈ నేపధ్యలోనే హైదరాబాద్ లో మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డాడు. ఎవరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న!

 

 

హైదరాబాద్‌ కోఠిలోని ప్రముఖ గోకుల్‌ చాట్‌ షాప్ యజమానికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్‌ చాట్‌ను మూసివేశారు. అలాగే, ఆ షాప్ లో పని చేసే 19 మందిని క్వారంటైన్‌కు తరలించారు. గత మూడు రోజులుగా గోకుల్‌ చాట్‌కు వచ్చినవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

 

IHG

 

ఇంకా అంతేకాదు తెలంగాణాలో రాష్ట్రంలో కేవలం నిన్న ఒక్క రోజే కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 5193 చేరింది. అయితే కేవలం ఈ ఒక్క నెలలోనే ఏకంగా రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: