భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. బలగాలను వెనక్కు మళ్లించినట్టే మళ్లించి నమ్మకద్రోహానికి పాల్పడుతోంది. ఈరోజు చెలరేగిన వివాదంలో భారత్ ఎదురు దాడికి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చింది. ఈరోజు భారత్ చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ రక్తసిక్తమైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో భారత్ కు చెందిన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. 
 
భారత్ చైనా గురించి ముందుగానే ఊహించి నిన్ననే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ లలో అదనపు బలగాలను మోహరించింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన మూడు అణుసహిత యుద్ధనౌకలు చైనా వైపు వస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు అమెరికా భారత్ కు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు వాడుతున్న యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాఫ్టర్లను మనకు పంపించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ నుంచి భారత్ అత్యవసర ఆయుధాలను సమీకరిస్తోంది. 
 
కేంద్రం డీఆర్డీవోతో భారీ ఎత్తున బ్రహ్మోస్ మిస్సైల్స్ ను తయారు చేయిస్తోంది. కేంద్రం చైనా సరిహద్దుల వైపు రోడ్లు వేయడం, విమానాలు నిర్మించుకోవడం చేస్తోంది. చైనాకు సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున యుద్ధనౌకలు చేరుతున్నాయి. కేంద్రం జమ్మూలో మార్చిలోనే పెద్దఎత్తున సైనిక బలగాలను మోహరించింది. ఫ్రాన్స్ నుంచి 4 రఫెల్ యుద్ధవిమానాలను భారత్ తీసుకుంటోంది. 
 
భారత్ చైనా నుంచి దేశంలో ప్రత్యక్ష పెట్టుబడులపై భారీ స్థాయిలో నిషేధం విధించింది. ఆర్మీ బలగాలు యుద్ధ వాతావరణం నెలకొన్నా సంసిద్ధంగానే ఉన్నాయి. జీ 7 దేశాల సరసన భారత్ ను చేర్చుకుంటూ ఉండటం.... ఐక్యరాజ్యసమితిని భారత్ కు ఇవ్వాలనే ప్రతిపాదన రావడం... ప్రపంచ దేశాలన్నీ భారత్ తో స్నేహానికి సిద్ధపడుతూ ఉండటం... కరోనా నుంచి ప్రపంచ దేశాల దృష్టి మరల్చటానికి... చైనా నుంచి భారత్ కు పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి డ్రాగన్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో చైనా ఎలాంటి కుట్రలకు పాల్పడినా భారీ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: