అవసరమైన నిధులు విస్తృతమైన అధికారాలు కావలసినంత మంది అధికారాలు స్పష్టమైన విధానాలు పాలన సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగు పడి తీరాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవు అని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కూలీ కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్షల కల్లాల ను ఏర్పాటు చేయాలని కోరారు.

 

రానున్న కాలంలో తెలంగాణ ప‌ల్లెలు దేశానికే ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. ఈ ల‌క్ష్య‌సాధ‌న‌లో క‌లెక్ట‌ర్లు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ప‌ల్లెల‌కు సేవ చేసే అదృష్టాన్ని అధికారులు అందిపుచ్చుకోవాల‌ని కోరారు.  ప్రతి గ్రామం ప్రతి రోజు శుభ్రం కావాల్సిందేనని ముఖ్యమంత్రి  రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో  గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడానికి మించిన పని మరొకటి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాబోయే నాలుగేళ్లలో ఏమి చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని దీనికి అనుకూలంగానే పనులు చేయాలని వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. 

 

ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్ట‌ర్లు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.శ్రీ కల్వకుంట్ల తారక రామారావు.   తన్నీరు హరీష్ రావు.  సత్యవతి  రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి.   సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్,  ఎర్రబెల్లి దయాకర్ రావు . గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి. .మొహమ్మద్ అలీ,   ఈటెల రాజేందర్,   వి. శ్రీనివాస్ గౌడ్,  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్.   ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పాల్గొన్నారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రిని క‌ల‌సిన మంత్రులు రాష్ట్రంలో నెల‌కొన్న ఆయా జిల్లాల్లోని క‌రోనా ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాల‌ను కూడా ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: