గమనిక: మన ఎపిహెరాల్డ్.కాం రీడర్ పొస్ట్ చేసిన కామెంట్ ఇది. 1) జగన్ యువకుడు, నూతన తరాన్ని చూసిన వాడు, ఈ తరం వాడిగా ఆలోచించే వాడు, వెనుక పడ్డ కడప జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక వృద్ధి కోసం పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాడు, ప్రజా వృద్ధికి ఉపాధి కల్పన ఎంత అవసరమో తెలిసిన వాడు. 2) జగన్ నిత్య శ్రామికుడు, రాష్ట్రంలో ఇంత చిన్న వయసులో ఇన్ని రోజులు ప్రజలలో కలిసి మెలిసి తిరిగిన ప్రజా నాయకుడు మన దేశంలో కనపడడు. ప్రజా సమస్యలు తెలుసున్న వ్యక్తికి వాటిని ఎలా పరిష్కరించాలి అనే మనసు ఉంటుంది. అదే ప్రజా నాయకుడి ప్రాధమిక లక్షణం. కనుక మనం భేషుగ్గా జగన్ గారిని నమ్మొచ్చు. 3) జగన్ ఏనాడు తెర వెనుక రాజకీయాలు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ తో ఓదార్పు యాత్ర తో విభేదాలు వచ్చి తను సొంతగా పార్టీ పెట్టి ప్రజలలో కలిసిన ధీరోదాత్తుడు. వెన్ను పోటు పొడిచే వాళ్ళకన్నా ముందుండి పోరాడే నాయకులు మన సమాజానికి చాలా అవసరం, లాంటి వాళ్ళే సమాజాన్ని ముందుకు నడిపించ గలరు. మామకి పోడిచినోడు రేపు ప్రజలకి పొడవడు అనే దానికి గ్యారంటీ లేదు కనుక ముందుండి పోరాడే జగన్ వెయ్యి రెట్లు బెటర్. 4) ప్రజా పోరాటాలు చేయడం, ఫీజు దీక్ష తో మొదలు పెట్టి రైతు దీక్ష, జల దీక్ష, అనేక దీక్షలు, పాద యాత్రలు చేసి ప్రజా పోరాటాల ద్వారా అసలయిన ప్రతి పక్షం గా నిరూపించుకున్నారు, కేవలం కేసుల కోసం కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిన చంద్ర బాబు తోటి, పదవుల కోసం కాంగ్రెస్ లో కలిసి పోయిన చిరంజీవి తో ఒక్కసారి పోల్చుకొని చూడండి. సిసలయిన ప్రతి పక్షం అంటే Ysr పార్టీ నే. ప్రజల కోసం పోరాడే పార్టీ కి ఓటు వెయ్యడం విజ్ఞుల లక్షణం. 5) పిడి వాద లెఫ్టిస్ట్, రైటిస్ట్ సిద్ధాంతాలు కాకుండా లిబరల్ పార్టీ సిద్ధాంతాలతో అటు దేశీయ పరిశ్రమల కోసం పాటు పడుతూ ఓపెన్ కాంపిటీషన్ కోసం కృషి చేసే మధ్యే వాద పార్టీ కనుక, తా బట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని కాకుండా తను నమ్మిన సిద్దంతాలని వదిలి పెట్టకుండా అవకాశ వాద పోత్తులకి, జిత్తులమారి ఎత్తులు వెయ్యకుండా కేవలం ప్రజలని నమ్ముకున్న సిసలయిన ప్రజాస్వామ్య వాది కనుక జగన్ ని నమ్మ వచ్చు. 6) వోట్ల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికల తరువాత అవసరం అయితే కేంద్రంలో NDA కి అయినా సరే సప్పోర్ట్ చేస్తాము అని తేల్చి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద పీట వేసిన అభివృద్ధి వాది.  7) ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా సరే అనవసరపు భావోద్వేగాలకి లోను కాకుండా కేవలం ప్రజా పోరాటాలు నమ్ముకున్న సిసలయిన పోరాట వాది. 8) అమ్మ ఒడి పధకం, పావలా వడ్డీ పధకాలు, ఆరోగ్యశ్రీ పధకాలు ద్వారా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ అదే సమయంలో పెట్టుబడీ దారి సమాజం ద్వారా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళకి మల్లే ఆంధ్ర ప్రదేశ్ ని సర్వతో ముఖాభివ్రుద్ధి చేస్తాడు అని నమ్మ వచ్చు. 9) జగన్ గారి పార్టీ ని కానీ అతని సలహా దారులని గానీ గమనిస్తే అన్ని కులాల మతాల వర్గాల వాళ్లు ఉంటారు, అంతెందుకు జగన్ గారి బిజినెస్ పార్టనర్ నిమ్మగడ్డ కూడా కమ్మ కులానికి చెందిన వ్యక్తి, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర్ రావు, సోమయాజులు, రెహమాన్ లాంటి వాళ్ళని గమనిస్తే YSR పార్టీ లో సామాజిక సమ్మేళనం గమనించ వచ్చు, YSR పార్టీ అన్ని వర్గాలకి, అన్ని మతాలకి సంబంధించిన పార్టీ కనుక ఏ వర్గానికి అధిక న్యాయం ఏ వర్గానికి అన్యాయం జరగదు అని తేల్చి చెప్ప వచ్చు. 10) తండ్రి అడుగు జాడలలో నడిచి జలయజ్ఞం, ఉచిత విద్యుత్ ఇతరత్రా రైతుల వ్యవసాయానికి అవసరమయిన అన్ని రకాల పధకాలతో రైతు మిత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. కనుక రైతులందరూ YSR పార్టీ ని సప్పోర్ట్ చేయాలి

మరింత సమాచారం తెలుసుకోండి: